Alia Bhatt: ఫ్యాన్స్ హృదయాలు గెలిచిన అలియా భట్ సాయం!

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ అలియా భట్ తన డ్రైవర్, హెల్పర్లకు గొప్ప సాయం చేసింది. ముంబైలోని జుహు, ఖార్ దండాలో ఇళ్లు కొనేందుకు ఆమె భారీ మొత్తం ఇచ్చింది. ఈ హీరోయిన్ మంచి మనసు గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటి అలియా భట్ తన ఉదారతతో అందరి మనసులు గెలిచింది. తన డ్రైవర్, హెల్పర్లకు ముంబైలో ఇళ్లు కొనేందుకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ మొత్తంతో వారు జుహు, ఖార్ దండా ప్రాంతాల్లో ఇళ్లు సొంతం చేసుకున్నారు. అలియా ఈ నిర్ణయం వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. సాధారణంగా స్టార్లు తమ సహాయకుల గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ అలియా మాత్రం వారి భవిష్యత్తు కోసం ఈ పెద్ద అడుగు వేసింది.
ఈ సాయం వారికి ఆర్థిక స్థిరత్వంతో పాటు కొత్త జీవన శైలిని అందించింది. నిజానికి అలియా ఈ సహాయం ఎప్పుడో 2019 లోనే చేసింది. దీని గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా, ఈ విషయం బయటకు రావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆమె మంచి మనసు బాలీవుడ్లోనే కాక, అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.