జాతియం

Nimisha Priya: నిమిష ప్రియ జైలు శిక్ష రిలీజ్ అవుతుందా..? లేదా..?

Nimisha Priya: భారత సంతతికి చెందిన ఓ మహిళ.. దేశం కానీ దేశం వెళ్లింది. అక్కడ తన కలల సౌదాన్ని నిర్మించాలనుకుంది. అక్కడ నర్సుగా పని చేసింది. సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుకుంది. కానీ… అక్కడి చట్టాలు ఆమె ఆశకు సంకేళ్లు వేశాయి. దీంతో ఆమె యెమెన్ జాతీయుడి సాయంతో హాస్పటల్ నడిపించడం మొదలుపెట్టింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. హాస్పటల్ ప్రారంభం తర్వాత ఆమెకు సహాయం చేసిన మెహదీ నిమిషా ప్రియాను విచ్చలవిడిగా వాడుకున్నాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు.

మెహదీ బాధల నుంచి తిరిగి తన దేశానికి రావాలనుకుంది నిమిష ఇందులో భాగంగానే మెహదీకి మత్తు మందు ఇచ్చింది. అయితే డోస్ ఎక్కువ అవ్వడంతో మెహదీ చనిపోయాడు. తాను చేసిన చిన్న తప్పు అసలుకే ఎసరు పెట్టింది. విషయం బయటపడితే ఇంక అంతే సంతగతులనుకోని మెహదీ శరీరాన్ని ముక్కులు ముక్కలు చేసి వాటర్ ట్యాంకర్‌లో పడేసింది. తర్వాత తాను తప్పించుకోవాలనుకుంది. చివరకు కటకటాల పాలైంది. కానీ ఇది కథ అంతం కాదు ఆరంభం మాత్రమే..

కేరళకు చెందిన నిమిషా ప్రియ ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈమె ఓ సాధారణ మధ్య తరగతి మహిళ. కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు ఇచ్చే ఆశతో, వైద్య సేవల కోసం యెమెన్‌కు వెళ్లింది. నర్సుగా పని చేస్తూ.. అక్కడి వైద్యవ్యవస్థను అర్థం చేసుకుంటూ సొంతంగా ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభించాలని కలలు కంది. అయితే యెమెన్ చట్టాలు దేశీయులకు ఇలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో, తలాల్ అబ్దో మెహదీ అనే స్థానికుడి సహాయంతో హాస్పిటల్ ప్రారంభించింది. ఆ సహాయం కాస్త తిప్పలు తెచ్చి పెట్టింది.

తలాల్ ఆమెను శారీరకంగా, మానసికంగా బాధించడం మొదలు పెట్టాడు. రోజూ హింసించేవాడు. అతని బాధల నుంచి బయటపడేందుకు నిమిషా ఒక రోజు అతనికి మత్తుమందు ఇచ్చింది. అయితే అది వికఠించి అతను చనిపోయాడు. దాంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురైయింది. విషయం బయటకు వస్తే ఏం జరుగుతుందోనని భయపడింది. తర్వాత దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసింది.

ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది. ఆమెపై యెమెన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై హత్య, శరీరాన్ని ధ్వంసం చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా హాస్పటల్ నిర్వహించడం వంటి మూడు నేరాలు నమోదయ్యాయి. యెమెన్ న్యాయవ్యవస్థ ఆమెకు రెండు సార్లు ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు ఆమె ప్రాణాలను కాపాడే మార్గంగా బ్లడ్ మనీ లేదా క్షమాపణ మాత్రమే మిగిలింది.

బాధితుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకోవడం లేదు. ప్రాణానికి ప్రాణం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకవేల బాధితుడి కుటుంబం దయ చూపకపోతే ఆమె ఉరిశిక్ష తప్పదు. భారత ప్రభుత్వం, మతపరమైన నాయకులు, మానవతావాదులు కలిసి ఆమె ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిమిషా కథ కేవలం నేరం గురించి కాదు. అది ఒక విదేశీ గడ్డపై, తాను కలలు కన్న దేశానికే గాయం లాంటింది.

కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్‌ వెళ్లారు. 2014లో యెమెన్‌లో యుద్దం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు నిమిషా ప్రియ భర్త , కుమార్తె. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యెమెన్ లో ఉండిపోయారు నిమిషా. యెమెన్ చట్టం ప్రకారం విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి.

దీంతో తలాల్ అబ్దో మహదీతో వ్యాపారం ప్రారంభించిన నిమిషా ప్రియ. తనను పెళ్లి చేసుకున్నట్టు తప్పుడు పత్రాలను సృష్టించి , పాస్‌పోర్ట్‌ను నిలిపివేసాడని, ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి, పదే పదే బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు నిమిషా ప్రియ.

2017లో తన పాస్‌పోర్ట్‌ను లాక్కొని యెమెన్‌ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో మహదిని మత్తులో పడేయడానికి ప్రయత్నింంది నిమిషా. కానీ మత్తు మోతాదు మించి చనిపోయాడు తలాల్ అబ్దో మహదీ. తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసినట్టు నిమిషా ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమెకు మూడు సార్లు డెత్ సెంటెన్స్ ప్రకటించారు.

అంటే ఒక్కొక్క దానికి అంటే ఆ వ్యక్తికి ఓవర్ డోస్ కెమికల్స్ ఇవ్వడం తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేయడం, శరీరాన్ని డంప్ చేయడం, తర్వాత ఎవిడెన్స్ క్లియర్ చేయడం ఇలా మూడు కేసుల్లో శిక్ష విధించింది న్యాయస్థానం. ఆ తర్వాత అపీల్ వేస్తే కోర్టు ఒక్క శిక్ష తగ్గించింది. ఈ కేసులో 2020 లో ప్రియకు రెండు సార్లు మరణశిక్ష విధించింది యెమెన్‌ న్యాయస్థానం. ప్రియా మరణ శిక్షను 2023లో హౌతీల సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమర్థించింది.

మొదటిగా డిసెంబర్ 2024న నిమిష ప్రియ తల్లి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఆమె యెమెన్‌కు వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంది. 2025 ఏప్రెల్ ఆమె అక్కడికి చేరుకుంది. అక్కడ ఈ మహదీ కుటుంబంతో సంప్రదింపులు చేసింది. క్షమాభిక్ష పెట్టమని కోరింది. దానికి మహదీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో సుప్రీంకోర్టులో అపీల్ వేశారు. కాంతాపురం ఏపీ అబూబకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి పోస్ట్ పోన్ చేపించారు. ఇక 16 జులైన పోస్ట్ పోన్ ను కంన్ఫామ్ చేసింది.

షరియా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయి. షరియా నుంచి వచ్చిన దాంట్లో రెండు ఉన్నాయి. అవి కిసాస్, రెండొది దియా అంటారు. కిసాస్ అంటే.. ఐ ఫర్ ఐ.. అంటే మా వ్యక్తిని వీళ్లు చంపారు కాబట్టి వాళ్ల వ్యక్తిని కూడా చంపాలి అన్నది. రెండోవది దియా అంటే ఇంగ్లీష్‌లో బ్లడ్ మనీ అంటూరు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కోర్టు చెప్పినంత డబ్బులు ఇవ్వగలిగితే ఆమెకు ఉరి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతానికి జరుగుతున్నది బ్లడ్ మనీ గురించి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి.

బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల అంటే దాదాపు 8.6కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. ఈ క్షమాధనాన్ని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ సంప్రదింపులు జరుపుతున్నారు.

అయితే ఒక వేళ మహదీ కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకున్నా నిమిషకు ఉరిశిక్ష నుంచి విముక్తి కలుగుతుంది. కానీ జైలు శిక్ష రిలీజ్ అవుతుందా..? లేదా..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చేతిలో ఓ నేరం జరిగింది. కాబట్టి ఉరి శిక్ష నుంచి ఆపగలరు కానీ.. జైలు శిక్ష నుంచి విడుదల చేయాల్సింది మాత్రం స్థానిక కోర్టు మాత్రమే.

గతంలో కూడా ఇలాంటి కేసు ఒకటి జరిగింది. అతని పేరు అబ్దూల్ రహీమ్.. అతను కూడా కేరళ అతనే తనకి కూడా మరణశిక్ష విధించబడింది. అతను బ్లడ్ మనీ పే చేసి మరణ శిక్ష నుంచి తప్పించుకున్నారు. కానీ అతనికి స్థానిక కోర్టు 20 సంవత్సరాల శిక్ష విధించింది. అయితే నిమిష కేసు విషయంలో బాధితులు బ్లడ్ మనీని ఒప్పుకోవడం లేదు.

మృతుడు తలాల్‌ అదిబ్‌ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్‌ ఫత్తా మెహది స్పష్టంచేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్‌మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని అన్నారు. న్యాయం దక్కాల్సిందే అన్నారు.

రాబోయే కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి..? వారి ఇరువురు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? మళ్లీ ఆమెకు ఉరి శిక్ష పడుతుందా..?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button