కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

కన్న తల్లిదండ్రులే, కూతురిని హతమార్చి, ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని జర్నలిస్టు కాలనీలో చోటుచేసుకుంది. రమేష్, లక్షీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా రెండో కుమార్తె తనూజ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంది. అయితే ఇంటికి వచ్చిన తనుజూ అదే కాలనీలో ఉండే వివాహితుడిని ప్రేమించింది.
విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తనుజను మందలించారు. అయినా కూతురి ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజు ప్రియుడు బ్రహ్మంతో ఫోన్లో మాట్లాడేది. ఈ క్రమంలోనే ఫోన్ మాట్లాడుతుండగా, తండ్రి రమేష్ చూసి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
అయితే తనుజా తండ్రిని ఎదిరించి ఫోన్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కూతురు గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత కూతురి మృతి చెందడంతో భయపడిన దంపతులు, ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్ధానికుల ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు కేసు విచారణ చేపట్టి తల్లిదండ్రులను విచారించారు.
దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన తనుజా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం తల్లిదండ్రులతో పాటు ప్రియుడు బ్రహ్మంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.