తెలంగాణ
Errabelli: నీటికోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పర్యటించారు. దేవరుప్పుల మాధపురం నుండి పాలకుర్తి గూడూరు వరకు ఎర్రబెల్లి పాదయాత్ర నిర్వహించారు. స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని, వానాకాలం పంటలకు దేవాదుల నీళ్లకోసం పడిగాపులు కాస్తున్న రైతులకు భరోసాగా రైతు పాదయాత్ర నిర్వహించారు.
రైతులు పంట పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే తాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్న గౌడ్ ఎర్రబెల్లికి కల్లు అందించడంతో అక్కడే సేవించారు.