ఆంధ్ర ప్రదేశ్
ఐనవోలులో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ దాడి

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలులో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్‌తో దాడి చేశారు. దంపతుల కేకలు విని స్థానికులు మంటలను ఆర్పేశారు. ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వద్ద ఫిర్యాదు తీసుకున్న పోలీసులు. పాత కక్షలు, ఆస్తి వివాదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.