తెలంగాణ
సిరిసిల్లా జిల్లా వేములవాడలో హైటెన్షన్

సిరిసిల్లా జిల్లా వేములవాడలో హైటెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూతన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా.. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్చుతున్నారంటూ బాధితుల ఆందోళన చేపట్టారు.
తమ ఇండ్లను కూల్చాలంటే తొలుత తమ ప్రాణాలు తీసి కూల్చివేతలు జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొందరు హోర్డింగ్‌ల పైఎక్కి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో అధికా రులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు.