అక్కినేని చైతూ కొత్త ఊపు!

Naga Chaitanya: నాగచైతన్య కెరీర్లో కొత్త జోష్! విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో NC24 మైథాలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. తండేల్ సక్సెస్‌తో ఊపు మీదున్న చైతూ, NC25 కోసం శివ నిర్వాణతో, మరో ప్రాజెక్ట్ కోసం తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు.
తండేల్తో వంద కోట్ల మార్కెట్‌ను అందుకున్న చైతూ, ఇప్పుడు NC24తో రెండు వందల కోట్ల లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు రూపొందిస్తున్న ఈ మైథాలాజికల్ థ్రిల్లర్‌లో చైతూ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
గతంలో కస్టడీ, తండేల్ మధ్య రెండేళ్ల గ్యాప్ తీసుకున్న చైతూ, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. NC24 సెట్స్‌పై ఉండగానే, మజిలీ దర్శకుడు శివ నిర్వాణతో NC25 కోసం ప్లాన్ చేస్తున్నాడు. అలాగే, సర్దార్ ఫేమ్ తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్‌తో కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేస్తూ, చైతూ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు.