My Baby : ‘మై బేబీ’ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే?

My Baby : తమిళ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘డీఎన్ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో అధర్వ, నిమిషా సజయన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భావోద్వేగాలతో ఆకట్టుకుంటోంది. తమిళ్ చిత్రసీమలో సంచలనం సృష్టించిన ‘డీఎన్ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబీ’ పేరుతో విడుదలవుతోంది. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హాస్పిటల్స్‌లో శిశువుల మాయం, అక్రమ అమ్మకాల నేపథ్యంలో ఒక గ్రిప్పింగ్ కథాంశంతో రూపొందింది.
అధర్వ, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించగా, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సమాజంలో జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. సురేశ్ కొండేటి నిర్మాణంలో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ వెర్షన్‌లాగే తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు. గిబ్రాన్ సంగీతం, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.