Srisailam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద నీరు

Srisailam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి లక్షా 77 వేల 873 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వరద నీరు వచ్చి చోరుతోంది. అలాగే ఔట్‌ఫ్లో లక్షా 68 వేల 868 క్యూసెక్కులుగా ఉంది. మూడు స్పిల్‌వే గేట్లు ఎత్తి 81 వేల 333 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35 వేల 315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32 వేల 220 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.9 అడుగులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 203.89 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే వరద ప్రారంభమైంది. జులై మొదటి వారానికి దాదాపు జలాశయం నిండిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారు.