జాతియం
Ram Mohan Naidu: AAIB నివేదిక.. అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు

Ram Mohan Naidu: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది భారత్‌లో ఉన్నట్లు చెప్పారు.
వారు పౌర విమానయానానికి వెన్నెముక వంటివారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దామని వెల్లడించారు. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నాయన్నానరు. అందుకే ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.