తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే.. టేకులగూడెం వంతెన వద్ద గల హైవే మూసివేశారు. వాహనాలు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
సమ్మక్క-సారక్క బ్యారేజీ 59గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదలుతున్నారు. దీంతో ములుగు జిల్లా ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర ప్రయాణం చేయాలనుకునే వారు భూపాపల్లి-కాళేశ్వరం మీదుగా వెళ్లాలని సూచనలు చేశారు.