ఆంధ్ర ప్రదేశ్
భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉధృతి

Bhadrachalam: తెలుగు రాష్ట్రాల్లో జలకళ సంతరించుకుంది. కృష్ణా, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 40.05 అడుగులకి గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో ఆలయ పరిసరాల్లోని స్నానఘట్టాలు మునగడంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అటు సీతమ్మవాగు వరద ప్రవాహంతో పర్ణశాల నీట మునిగింది. 43 అడుగులకి గోదావరి వరద ప్రవాహం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు ఎగువ నుండి 6లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే వచ్చిన వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.