తెలంగాణ
Errabelli Dayakar Rao: రేవంత్‌రెడ్డి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తీస్తున్నారు

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైరయ్యారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని ఎర్రబెల్లి అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును తీస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచిందన్నారు.
ఎన్నికలు వస్తేనే రేవంత్‌కు రైతు భరోసా లాంటి పథకాలు గుర్తోస్తుందని ఆయన చురకలంటించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.