UAE Golden Visa: భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా

UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. భారతీయులకు తీపి కబురు అందించింది. కొత్తరకం గోల్డెన్ వీసాను ప్రారంభించింది. నామినేషన్ ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో కొన్ని షరతులు ఉన్నప్పటికీ ఇంతకు ముందున్న చాలా నియమాలను సవరించింది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 23లక్షల 30వేలు ఫీజు చెల్లిస్తే జీవితకాలం వ ర్తించే వీసా అందజేస్తుంది.
ఇప్పటిదాకా దుబాయ్‌లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు 4కోట్ల 66లక్షల కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెడుతుండే వారు. కానీ ఇప్పుడు చాలా నియమాలను సవరించారు. ఇప్పుడు కొత్త విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని దుబా య్ ప్రభుత్వ వర్గాల అంచనా.
పథకం పైలట్ ప్రాజెక్టు కోసం UA భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సం ప్రదించాల్సి ఉంటుందని తెలిపింది. లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. ఇక దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.