తెలంగాణ
మేడ్చల్ జిల్లాలోని నర్సింహారెడ్డి కళాశాలలో NSUI నాయకుల ధర్నా

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో NSUI నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదనే సాకులు చెబుతూ విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని NSUI నాయకులు ఆందోళనకు దిగారు. కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నర్సింహరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.