ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ హౌస్ కూల్చివేత

కడప జిల్లా బద్వేలులో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాదు ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపుతు న్నారు. ఇటీవల బయనపల్లెలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ హౌస్‌ను కూల్చివేశారు. ఇప్పుడు ZPTC పొలిరెడ్డి ఆక్రమణలపై కొరడా ఝలిపించారు. మూడంతస్తుల వ్యాపార సముదా యానికి నోటీసులు అంటించారు.
బిల్డింగ్‌ను సీజ్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇస్తారని..?, పన్నులు ఎలా చెల్లించుకున్నా రంటూ బాధితుల మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.