తెలంగాణ
Ramachandra Rao: టీ.బీజేపీ చీఫ్‌గా రాంచందర్ రావు బాధ్యతలు

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాంచందర్ రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ఉస్మానియా వర్సిటీలోని సరస్వతి ఆలయంలో రాంచందర్ రావు పూజలు నిర్వహించారు.
అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గన్‌పార్క్ వద్దకు చేరుకుని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఇక రాంచందర్ రావు బాధ్యతల స్వీకరణ నేపథ్యం లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.