తెలంగాణ
Bandi Sanjay: బీజేపీ బీసీని ప్రధానిని చేసింది

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైన బీసీని ప్రధానిని చేశారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బీసీని ప్రధానిని చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నైనా బీసీని సీఎం చేయలేదని మండిపడ్డారు.
బీసీని ప్రధానిని చేస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఏ కారణంగా సామాజిక న్యాయ భేరి సభ పెట్టారని ఆయన విమర్శించారు. సామాజిక భేరి కాదు. సామాజిక అన్యాయం భేరి అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.