తెలంగాణ
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ మహేష్ గౌడ్ సీరియస్

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించింది. క్రమ శిక్షణ కమిటీ సమావేశంలో అనిరుధ్‌రెడ్డిపై చర్యలు ఉండే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌లో చంద్రబాబు కోవర్టులున్నారని అనిరుధ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే.. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపి వేయాలని ఆయన సూచించారు.