ఆంధ్ర ప్రదేశ్
ఆ గ్రామంలో వింత ఆచారం.. సోమవారం ఎద్దులకు సెలవు

Kurnool: కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురం గ్రామస్తులు వినూత్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పురాతన కాలం నుంచి ఆ గ్రామంలో మనుషులతో సమానంగా వారి ఎద్దులకు సెలవులు ప్రకటించారు. ప్రతి సోమవారం వారి ఎద్దులకు సెలవు దినం ప్రకటించి భక్తితో పూజిస్తారు. గ్రామంలో రైతులు పొలంలో విత్తనం వేసే పని ఉన్నా వాయిదా వేసుకుంటారు. తమ పెద్దల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. దాన్ని కొనసాగిస్తూ అన్ని తరాలు పాటిస్తున్నామన్నారు.