తెలంగాణ
KTR: కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు

KTR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. షుగర్, సోడియం లెవెల్స్ పర్యవేక్షించేందుకు అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు కేటీఆర్.