అంతర్జాతీయంజాతియం

అక్రమ సంబంధంతో అడ్డంగా దొరికి.. క్షమించమంటూ ప్రియుడికి 3 కోట్ల గిఫ్ట్.. కోర్టు ఏమందంటే?

China Court: ప్రేమించిన వాళ్లను మోసం చేసే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. కానీ వారికి శిక్షలు వేసే కోర్టులు మాత్రం చాలా తక్కువ. అందుకు కారణం మోసపోయిన ఏ అబ్బాయి కూడా కోర్టుకు వెళ్లడు. కానీ అదే స్థానంలో అమ్మాయి ఉంటే మాత్రం వెంటనే కోర్టుకు వెళ్తుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కేసు మాత్రం దీనికి భిన్నం. తానే ఓ యువకుడిని మోసం చేసి కోర్టు మెట్లెక్కింది. అది తెలుసుకున్న కోర్టు అమ్మాయికి గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ కేసు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాకు చెందిన లీ అనే యువకుడు.. జు అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమెకు కూడా ఇతడు నచ్చడంతో ఇద్దరూ కలిసి 2018 నుంచి డేటింగ్ చేస్తున్నారు. రెండేళ్ల పాటు వీరి బంధం బాగానే సాగింది. కానీ 2020లో జు.. లీ మేనల్లుడితో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న లీ ప్రేయసితో గొడవ పడ్డాడు. ఇలా ఎలా మోసం చేశావంటూ నిలదీశాడు. ఆ తర్వాత నుంచి ఆమెతో మాట్లాడడం మానేశాడు. కానీ జు మాత్రం అతడిని విడిచి పెట్టలేదు. రోజూ మాట్లడమని.. చేసిన తప్పును క్షమించమని కోరేది.


ఎన్ని మాటలు చెబుతున్నా లీ వినకపోయేసరికి నగదు బహుమతి ఇచ్చింది జు. ఏకంగా 3 లక్షల యువాన్లు అందజేసింది. ఇండియా కరెన్సీలో అక్షరాల 3.2 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును జు.. లీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు తీసుకుని తనను క్షమించి తనతోనే ఉండాలని చెప్పింది. కానీ డబ్బులు తీసుకున్న లీ ఆమెతో మాట్లాడడం మానేశాడు. దీంతో జు కోర్టును ఆశ్రయించింది. తన డబ్బును తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని వేడుకుంది.


కానీ లీ మాత్రం.. జు చేసిన ద్రోహం వల్ల తాను గురైన మానసిక క్షోభకు పరిహారంగానే ఆ డబ్బు లీ అందించినట్లు చెప్పాడు. అయితే కోర్టు లీ పక్షాన నిలిచింది. ఇది బహుమతి అయినా సరే తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత లీకి లేదని తేల్చి చెప్పింది. అలాగే చెల్లింపు స్వచ్ఛందంగా జరిగిందని.. ముఖ్యంగా తప్పు చేసినందుకు క్షమించాలని కోరుతూ మాత్రమే ఇచ్చినట్లు వివరించింది. చైనా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ కేసులో… కోర్టు తీర్పు విని చాలా సంతోష పడ్డారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button