Arvind Kumar: అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారుల ప్రశ్నలు

Arvind Kumar: అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారుల ప్రశ్నలుఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. IAS అరవింద్ కుమార్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారాం. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లు తెలుస్తుంది. HMDA ఖాతా నుండి FEO కంపెనీకి.. నిధులు మల్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్లు సమాచారం.
కేటీఆర్‌యే FEOకి నిధులు విడుదల చేయాలని చెప్పారన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 47.71కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా, బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించినట్లు ఏసీబీకి వివరించారు. అయితే నిర్వహణకు HMDA నిధులు ఎందుకు చెల్లించారని మళ్లీ ఏసీబీ క్వశ్చన్ చేసింది. అంతేకాదు సీజన్ 9 చెల్లింపులు పూర్తికాకుండానే సీజ న్ 10 ఎందుకు నిర్వహించాలనుకున్నారని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్‌ను ప్రశ్నించారు. ఇక ష్యూరిటీ లేకుండా నిధులు ఎందుకు చెల్లించారని అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారుల క్వశ్చన్ చేశారు.