తెలంగాణ
Konda Murali: రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం

Konda Murali: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ ముగిసింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్‌కు వివరించారు. కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది.
తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తుచేశారు.