తెలంగాణ
Harish Rao: హైడ్రా కూల్చివేతలపై హరీష్ రావు ట్వీట్

Harish Rao: హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాల ఇల్లు కూలుస్తున్న హైడ్రాను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం పేదవారు వారి కనీస వసతులు కాపాడుకునేందుకు వేడుకున్నారు.
కానీ బుల్డోజర్లు వారి బతుకులను అర్థాంతరంగా కూల్చివేశాయని తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్న బుల్డోజర్ బాధితులను పరామర్శిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయిన బాధితులను మాత్రం లెక్కచేయడంలేదని మండిపడ్డారు. ఇకనైనా పేదల జోలికి రాకుండా ఉండాలని రేవంత్‌కు చెప్పాలని రాహుల్ గాంధీకి, ఏఐసీసీ పెద్దలకు హరీష్ రావు ట్వీట్ చేశారు.