తెలంగాణ
Ramachandra Rao: నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ కార్యకర్తను… మీ సేవకుడినే

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేరుకే అధ్యక్షుడినని, కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన సారథులన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.
బీజేపీలో కొత్త, పాత అనే పంచాయితీ లేదన్నారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు చేరాలి. తెలంగాణలో యువత రాజకీయాల్లోకి రావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.