తెలంగాణ
Ibrahimpatnam: పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేశారు. పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ చేశారు. ఆలయంలో 2 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, అమ్మవారి నగలు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. 10 రోజుల క్రితం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గంగాదేవి పండుగ నిర్వహించారు. అయితే సమీపంలో ఉన్న రామాలయంలో సైతం చోరీకి పాల్పడ్డారు దుండగులు.
రెండు ఆలయాల్లోని విగ్రహాలు తీసుకెళ్లారు. గతంలోనూ కాటమయ్య, ఎల్లమ్మ ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.