వైసీపీలోకి వెళ్లనున్న జేసీ ప్రభాకర్ ..?

JC Prabhakar Reddy: ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అందుకు కారణం జేసీ బ్రదర్స్. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాడిపత్రి కంచుకోటను ఏకాచత్రాధిపత్యంగా ఏలారు. 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాజకీయ ఆధిపత్యం కొట్టుకుపోయింది. దీంతో వైసీపీ తరపున అప్పట్లో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించి ఫ్యాన్ జెండాను తాడిపత్రి గడ్డపై ఎగురవేశారు.
ఆ తర్వాత నుంచి పెద్దారెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తునే ఉంది. తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చేసిన అక్రమాలు అన్యాయాలపై ఎలాగైనా శిక్ష ఫలితం అనుభవించేలా చేయాలన్న ఉద్దేశంతో జెసి ప్రభాకర్ రెడ్డి అనునిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయితే అనూహ్యంగా జేసీ ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయన వైసీపీలోకి జంప్ అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన మనసులో మాట ఇన్నాళ్లకు బయటపడిందని కొందు టీడీపీ శ్రేణులు అంటున్నారు.