Pashamylaram: పాశమైలాపం పేలుడు ఘటనలో 45కు పెరిగిన మృతుల సంఖ్య

Pashamylaram: ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. ఆస్పత్రుల్లో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతున్నవారిలో 12 మంది పరిస్థితి విషమం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 43 మంది గల్లంతు కాగా వారిలో ఒడిశా, యూపీ, బిహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన చెందుతున్నారు.
భవనం శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు అధికారులు అంచనా వేసారు. మైక్రో క్రిస్టల్ సెల్యూలోజ్ డ్రయింగ్ యూనిట్‌లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలింది.
ఇప్పటికీ 43 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని, 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృత దేహాలు ఉన్నట్టు చెప్పారు. అయితే డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు. సహాయం కోసం హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.