తెలంగాణ
టీ.బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రాంచందర్ రావు

Telangana: ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రాంచందర్ రావు ఎన్నికయ్యారు. చెప్పాలంటే రాంచందర్ రావు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అయితే బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావేనని ఉదయం 11గంటలకి అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఇక నిన్న రాంచందర్ రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక లాంఛనమైంది.
నేడు మన్నెగూడలోని తెలంగాణ బీజేపీ కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా ఉండనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ కిషన్ రెడ్డి, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.