ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో భారీ వర్షం.. ఈదురు గాలులు

నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో తీవ్ర ఉక్కపోతకు గురైన విశాఖ ప్రజలు రాత్రి కురిసిన వర్షంతో ఉపసమనం కలిగిందంటున్నారు. రాత్రి వర్షం, భారీ గాలులకు చెట్లు కూలిపోయాయని దీంతో అక్కయ్యపాలెం శంకర్ మఠం లలిత నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.