Kubera: ధనుష్-రష్మిక ‘కుబేర’ సంచలన రన్‌టైమ్‌తో రెడీ!

Kubera: ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ సినిమా సంచలనం సృష్టించనుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున కలిసి నటిస్తున్న ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సినిమా అన్ని పనులూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, రన్‌టైమ్ విషయంలో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని సమాచారం! శేఖర్ కమ్ముల సినిమాలు సాధారణంగా ఎక్కువ రన్‌టైమ్‌తోనే ఉంటాయి, కానీ ‘కుబేర’ అందరి ఊహల్నీ మించిపోయింది. ఇంత పొడవైన రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్‌లో కట్టిపడేయడం ఈ చిత్రానికి పెద్ద సవాల్. ఒకవేళ కథ, సన్నివేశాలు ఆకట్టుకుంటే హిట్ ఖాయం, లేకపోతే ప్రమాదమే! మేకర్స్ ఈ సవాల్‌ను ఎలా అధిగమించారో తెలియాలంటే జూన్ 20 వరకు వేచి చూడాలి.