అఖండ 2 తాండవం: బాలయ్య – బోయపాటి మాస్ జాతర!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటేనే మాస్ హవా! వీరి నాలుగో చిత్రం ‘అఖండ 2 తాండవం’ టీజర్ రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బాలయ్య బాబు మాస్ సినిమాలతో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్! బోయపాటి శ్రీనుతో కలిసి ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’లతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు ‘అఖండ 2 తాండవం’తో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధం. ఈ టీజర్‌లో శివతాండవం చేస్తున్న బాలయ్య లుక్, బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.
కొన్ని షాట్స్‌పై సోషల్ మీడియాలో చిన్నపాటి విమర్శలు వచ్చినా, బోయపాటి మాస్ మ్యాజిక్ ముందు అవి పట్టవు. లాజిక్‌లను వదిలేసి జస్ట్ మాస్‌ను ఎంజాయ్ చేయాలనే ఫ్యాన్స్ టాక్ వినిపిస్తోంది. థమన్ బీజీఎం, భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.