తెలంగాణ
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశం అవుతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నారు.
ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన, పథకాల అమలు తీరు, పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైనా సంప్రదింపులు జరుపు తున్నట్లు టాక్ వినబడుతోంది.