తెలంగాణ
KTR: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది

KTR: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బూటకమని ఇప్పటివరకు తాము చెప్పిందే నిజమని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైందన్నారు.
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ తిరస్కరించడం రాష్ట్రంలో సర్కార్‌కు, కేంద్రంలోని బీజేపీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఏడాదిన్నర సాగదీసి అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు.