IndiGo Flight: వడగళ్ల వానకు దెబ్బతిన్న విమానం ముక్కు

IndiGo Flight: ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమాన ప్రయాణికులకు బుధవారం భయానక అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా విమానం గాలిలో భారీ కుదుపులకు లోనైంది. ఉత్తర భారతలో ని పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం గాలివానలో చిక్కుకుంది. గాల్లో ఉండగానే తీవ్ర కుదుపులకు గురికావడంతో పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ, విమానం ముందుభాగం దెబ్బతినడం, అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానంలో మొత్తం 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న పిల్లలు, పెద్దలు అరుస్తూ, ఏడుస్తూ భయంతో గడుగడలాడిపోయారు.
గాలివానకు విమానం కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగులు, మెరుపుల వెలుగులు విమానం కిటికీల నుంచి కనిపించడంతో మరింత వణికిపోయారు. అయితే, విమానం తుఫానులో చిక్కుకున్న వెంటనే పైలట్ శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర సమాచారం ఇచ్చాడు. అయితే, అన్ని నిబంధనలను పాటిస్తూ, విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశాడు. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.