Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్

Thatres Bandh: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పిలుపు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. అద్దె విధానంతో నష్టాలు రావడంతో ఎగ్జిబిటర్లు షేర్ బేసిస్‌కు మారాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని హెచ్చరించారు.
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం! తెలుగు రాష్ట్రాల మూవీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని, ఇకపై షేర్ బేసిస్‌లోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. 65 మంది ఎగ్జిబిటర్లు హాజరైన ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్‌లకు తెలియజేయనున్నట్లు ప్రకటించారు.
ప్రొడ్యూసర్లు సహకరించకపోతే జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. జూన్‌లో రిలీజ్ కానున్న చిత్రాల భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. సినీ అభిమానులు, నిర్మాతలు ఈ బంద్‌తో ఆందోళన చెందుతున్నారు.