తెలంగాణ
Chamala Kiran: కోడి గుడ్డు పైన ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది

Chamala Kiran: బీఆర్ఎస్పై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైరయ్యారు. కోడి గుడ్డు పైన ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. పదేళ్లు వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదన్నారు. అలాంటి కేటీఆర్ మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదన్నారు. జనాలను తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.