ఆంధ్ర ప్రదేశ్
Road Accident: బొలెరోను ఢీకొట్టిన డీసీఎం.. నలుగురు కూలీలు మృతి

Road Accident: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బొలెరోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.