అంతర్జాతీయం

అమెరికాలో భారీ వర్షాలు.. 9 మంది మృతి

America: అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ గాలుల కారణంగా పలు భవనాలు ధ్వంసం అవుతున్నాయి. కెంటుకీలోని ఇళ్లను వర్షపునీరు ముంచెత్తడంతో ఏకంగా 9 మంది మృతి చెందారు. కెంటుకీలో గడిచిన 48గంటల్లో రికార్డ్‌ స్థాయిలో వర్షం కురిసింది. వరదల కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగి పోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39వేల ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది.

దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్‌ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్‌ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్‌ ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button