తెలంగాణ
Musi River: నిండు కుండలా మూసీ ప్రాజెక్టు.. ఏడు గేట్లు ఎత్తివేత

Musi River: మొంథా తుపాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న నిరంతర వర్షాలతో మూసి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 7 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసి నది ఒడ్డు గ్రామాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
వర్షపాతం ఇంకా కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.ప్రాజెక్ట్‌కి ఇన్‌ఫ్లో 2,677 క్యూసెక్కులు , ఔట్‌ఫ్లో 2,368 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 644.60 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.36 టీఎంసీలు ఉంది.



