తెలంగాణ
బీసీ హాస్టల్ పైనుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. బీసీ హాస్టల్ భవనం పైనుండి ఐదో తరగతి విద్యార్థిని కిందకు దూకింది. నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చే సుకుంది. మృతిచెందిన బాలికను సంధ్యగా గుర్తించారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.