తెలంగాణ
Sircilla: పిచ్చికుక్కల స్వైరవిహారం.. 50 మందికి పైగా కుక్కకాట్లు

Sircilla: సిరిసిల్ల పట్టణంలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలలు కుక్కకాటు భారినపడ్డారు. బి.వై.నగర్, గోపాల్ నగర్, ఇందిరా నగర్, వెంకట్రావ్ నగర్, మార్కెట్ ఏరియా, సుందరయ్య నగర్, కొత్త బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఒక్కరోజులోనే 50 మందికి పైగా కుక్క కాటుకు గురయ్యారు.
గాయపడిన బాధితులను స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మీద నడుస్తున్న వారిపై, ఇళ్ల ముందే నిలబడ్డ వారిపై కుక్కలు దాడి చేశాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.



