Encounter: ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

Encounter: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్‌ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామంగా అధికారులు తెలిపారు .
గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్‌పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .



