తెలంగాణ
కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి

హైదరాబాద్ రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.



