తెలంగాణ
జలదిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు

మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది.
హంటర్ రోడ్ లోని మహిళా హాస్టల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మొదట డ్రోన్ల ద్వారా ఆహారం, త్రాగు నీరు పంపించారు. తర్వాత SDRS టీమ్ విద్యార్ధులను సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు.



