ఇంఫాల్ లోయలో వెదురు శిలాజాలు.. ఆసియాలోనే అతి పురాతనమైనవి!

చెట్టువెదురులో ఆ శ్రీకృష్ణుడి మురళి దాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ.. ఇప్పటి కాలంలో అవి దొరకడం చాలా అరుదు. అయితే… ఓ ప్రదేశంలో అతి పురాతన వెదురు శిలాజాల్లో మంచు యుగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయట. భారత్‌తో పాటు ఆసియా ఖండపు వృక్షశాస్త్ర చరిత్ర గతినే అవి సమూలంగా మాచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు.
శ్రీకృష్ణుడి మురళి అంటే ఇష్టం ఉండని వారంటూ ఉండరు. ఆయన గానంతో అందరి మనస్సును మైమరించేస్తాడు. కృష్ణుడి అడుగుల జాడలే అందరికి ఆదర్శం. ఆయన మురళీ గానం వింటే ఎంతటి కష్టానైనా మరిచిపోతారని నమ్మకం. అయితే ఇప్పుడు అదే మురళి ఓ పురాతన చెట్టువెదురులో దాగుంటుందని నమ్ముతారా..? అవును అదే నిజం కృష్ణుడు మురళి ఆ చెట్టు వెదురు నుంచే తయారు చేస్తారు.
ఇప్పుడు మణిపూర్‌లో అలాంటి మురళి ఆనవాళ్లు కనిపించాయి. ఇంఫాల్ లోయలోని చిరంగ్ నది సిల్ట్-పుష్కల నిక్షేపాలలో పరిశోధకులు పురాజీవ అవశేషాలను పరిశీలిస్తుండగా.. ఆశ్చర్యకరమైన రీతిలో చెక్కుచెదరని వెదురు కాండం శిలాజాన్ని గుర్తించారు. ఈ శిలాజంపై గతంలో అంతరించిపోయిన ముళ్ల అస్పష్టమైన గుర్తులు ఉన్నాయి. ఆసియాలో ఇంతకుముందు లభించిన ఈ అత్యంత పురాతన ముళ్ల వెదురు శిలాజం, ఇది వృక్షశాస్త్ర చరిత్రలో ఒక అధ్యాయాన్ని తిరిగి రాయనుంది.
అది అలాంటిలాంటి శిలాజం కాదు. ఏకంగా 37,000 ఏళ్లనాటి వెదురు తాలూకు అత్యంత అరుదైన శిలాజం. ఎందుకంత అరుదైనదీ అంటే వెదురు శిలాజ రూపు దాల్చడం కనాకష్టం. దాని లోపలంతా బోలుగా ఉండటమే అందుకు కారణం. దాంతో అతి త్వరగా కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. అది ఇప్పటిదాకా వెల్లడించిన, ఇకపై జరిపే పరిశోధనల్లో బయటపెట్టబోయే రహస్యాలు భారత్‌తో పాటు ఆసియా వృక్షశాస్త్ర చరిత్రనే తిరగ రాయగలవని భావిస్తున్నారు.
ఇంఫాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. ఆసియా ప్రాంతంలో మంచుయుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని వెదురు తన ఉనికిని కాపాడుకుందనేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బృందంతో కలిసి బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ సైంటిస్టులు ఈ శిలాజాలపై ముమ్మరంగా పలు పరిశోధనలు జరుపుతున్నారు.
వాటి తాలూకు పలు భాగాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకునేందుకు అవి ఎలాంటి పద్ధతులను అవలంబించిందీ క్రమంగా వెలుగులోకి వస్తోందని వారు చెబుతున్నారు. శిలాజ రూపు దాల్చిన వెదురు జాతిని జెనస్ చిమొనోబాంబూసాగా గుర్తించారు.
మంచుయుగం తాలూకు అతి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా చాలారకాల వెదురు జాతులు అంతర్ధానమైపోయాయి. యూరప్ మొదలుకుని అమెరికా ఖండాల దాకా ఇదే పరిస్థితి. అయినా మణిపూర్‌లోని ఈ జెనస్ జాతి తట్టుకుని నిలవడానికి కారణాలన్నింటినీ కనిపెట్టేందుకు సైంటిస్టుల బృందం అన్నిరకాలుగానూ ప్రయత్నిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిలాజాల తాలూకు విడిభాగాలను ఒక్కొక్కటిగా మథిస్తోంది.
‘‘ఈశాన్య భారతంలోని అపార జీవవైవిధ్యం కారణంగా మంచుయుగపు ప్రభావం ఇక్కడ మరీ ఎక్కువగా పడి ఉండకపోవచ్చు. ఈ వెదురు జాతులు ఆ కష్టకాలాన్ని గట్టెక్కి మనుగడ సాగించేందుకు అదే కారణం కావచ్చు అన్న వాదనల్లోని నిజానిజాలను కూడా నిగ్గుదేల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలను పాలయోబోటనీ, పాలియాలజీ జర్నల్ రివ్యూలో ప్రచురించారు.
కాగా.. భారతదేశంలో, మొఘల్ చక్రవర్తి హుమాయున్ 1500లో కాశ్మీర్ నుండి మంచును దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు మొఘల్ రాజులు పండ్ల రసాన్ని మంచుతో నిండిన పర్వతాలకు పంపేవారు. అక్కడ ఆ రసాలను సేకరించి షర్బత్ తయారు చేసేవారు. రాజులు, చక్రవర్తులు కాకుండా మొఘల్ కాలంలో మంచు కరగకుండా సాల్ట్ పీటర్ అంటే పొటాషియం నైట్రేట్ చల్లేవారు. మొఘలుల కాలంలో కుల్ఫీని భారతదేశంలో తయారు చేయడం ప్రారంభించిన మాట వాస్తవమే. అక్బర్ హయాంలో హిమాలయ లోయల నుంచి మంచును తీసుకొచ్చారు.
ఇందుకోసం ఏనుగులు, గుర్రాలు, సైనికుల సహాయం తీసుకున్నారు. హిమాలయ పర్వతాలు ఆగ్రా నుండి 500 మైళ్ల దూరంలో ఉన్నాయి. అమెరికా నుండి సముద్రపు నౌకల్లో మంచు భారత్‌కు రావడం ప్రారంభించినప్పుడు, దానిని నిల్వ చేయడానికి అనేక నగరాల్లో మంచు గృహాలు నిర్మించబడ్డాయి. ఇవి సాధారణంగా కోల్‌కతా, ముంబై, మద్రాస్ వంటి ఓడరేవు నగరాలుగా పిలువబడే నగరాలు, ట్యూడర్ మొదటిసారిగా 1833లో ది క్లిప్పర్ టుస్కానీ ఓడలో మంచుతో భారతదేశానికి చేరుకున్నాడు.
భారతదేశం రహస్యాలకు పుట్టినిల్లు.. ఇది కాదనలేని సత్యం. ప్రతి చోట దేశానికి సంబందించిన రహస్యాలు నిక్షిప్తం అయి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అలాంటి రహస్యమే.. దేశానికి మణిహారమైన మణిపూర్ లో లభ్యమైంది. మరి చూడాలి ఇలాంటి రహస్యాలు ఇంకెన్ని దొరుకుతాయో.



