తెలంగాణ
అమ్రాబాద్‌లో 36కు చేరిన పెద్ద పులులు

నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. సర్వేలో 20 ఆడ పులులు,13 మగ పులులు, గుర్తించని ఒక పులి, ఇంకా రెండు కూనలు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది 33 పెద్ద పులులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 36 కు చేరింది. ఇది పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధిగా పేర్కొన్నారు.
ఈ విజయానికి ప్రధాన కారణాలు స్థానిక ప్రజల సహకారం, అటవీ సిబ్బంది కృషి, అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలేనని డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. పులులు మన పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అన్నారు. వాటిని కాపాడటం మనందరి బాధ్యత అందులో భాగంగా అమ్రాబాద్ అభయారణ్యంలో కొనసాగుతున్న ఈ సంకల్పానికి సహకారం అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు.