జాతియం
అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం

అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి నాలుగు బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 36మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాంబన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భగవతినగర్ నుంచి పహల్గామ్ బేస్ క్యాంప్‌నకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై చందర్ కూట్ సమీపంలో ఈ నాలుగు బస్సులు ఢీకొన్నాయి.