తెలంగాణ
నల్గొండ జిల్లా చిట్యాలలో 250 కేజీల గంజాయి పట్టివేత

నల్లగొండ జిల్లా చిట్యాల హైవే 65పై పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 125 పాకెట్లలో ఉన్న 250 కేజీల గంజాయిని మూడు కార్లలో ఏడుగురు నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఏవోబీ బోర్డర్ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పోలీసులు చిట్యాలలో మాటువేసి పట్టుకున్నారు.
నూర్ మహ్మద్ అనే నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా ఢిల్లీ, యూపీలకు చెందిన మరో ఆరుగురు పరారయ్యారు. స్మగ్లర్లకు ఒక్కొక్కరికీ 20 వేల రూపాయల చొప్పున ఇస్తూ ప్రధాన నిందితుడు మోనిస్ గంజాయిదందా నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.



